Saturday, December 11, 2010

యాడ్ లో యన్ టి ఆర్
మన వినియోగ దారులను ఆకట్టుకోటానికి కార్పొరేషన్ కంపెనీలు వేసే ఎత్తులు అన్నీ ఇన్నీ కావు.వీరివల్ల మన క్రికెటర్లు కోట్లకి కోట్లు గడిస్తున్నారు.అది గమనించిన మన తెలుగు సినీ హీరోలు కూడా ఆ దారిలోనే పయనించటానికి ప్రయత్నిస్తున్నారు.మహేష్ బాబు థంమ్స్ ప్ కంపెనీకి,అమృతాంజనం కంపెనీకి మోడల్ గా ఉంటే రామ్ చరణ్ పెప్సి కంపెనీకి మోడల్ గా ఉన్నారు.జూనియర్ యన్ టి ఆర్ కూడా ప్రస్తుతం జండూబామ్ కంపెనీకి ప్రచారం చేయటానికి అంగీకరించాడట.యన్ టి ఆర్ ఇంతటితో ఆగుతాడో మరిన్ని యాడ్ లలో నటిస్తాడో వేచి చూడాలి.ఇదే దారిలో మరికొందరు హీరోలు కూడా యాడ్ లలో నటించటానికి ఉత్సాహం చూపుతున్నారని సమాచారం.

ఆస్తులమ్ముతున్న నాగబాబుఅంజనా ప్రొడక్షన్స్ పతాకంపై,రామ్ చరణ్ హీరోగా,జెనీలియా హీరోయిన్ గా,బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో,నాగబాబు నిర్మించిన విభిన్న ప్రేమ కథా చిత్రం"ఆరెంజ్".ఈ చిత్రం విడుదలై ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతూంది.ఈ చిత్రానికి హేరీస్ జైరాజ్‍ సంగీతాన్ని అందించించారు.ఈ చిత్ర నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఆయన నానా ఇబ్బందీ పడుతున్నారనీ,చివరికి తనకున్న ఒక గెస్ట్ హౌస్ బంగ్లాని కూడా అమ్మకానికి పెట్టారని ఫిలిం నగర్ లో రూమర్లు షికార్లు చేస్తున్నాయి.ఈ చిత్రానికి సరైన
అవగాహన లేకుండా అవసరానికి మించిన అనవసర ఖర్చులు చేసి మంచి మనసున్న నిర్మాత నాగబాబుని కష్టాలపాలు చేసిన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మీద సినీ నిర్మాతలందరూ కన్నెర్ర చేస్తున్నారని సమాచారం.అమదుకే నాగబాబు "మిరపకాయ్"ఆడియో సభలో
అలా ఆవేశంతో మాట్లాడరని కూడా అంటున్నారు.

రాత్రికి మూడు కోట్లు వద్దన్నతార
ఎవరికైనా డబ్బిస్తామంటే వద్దంటారా...?కానీ ఒక్క రాత్రికి మూడు కోట్ల రూపాయల భారీ మొత్తాన్నిస్తామంటే, నాకొద్దుపొమ్మన్నదొక అందాల భామ.ఎవరా భామ...? ఏమా కథ...? వివరాల్లోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాగా డిమాండ్
అలాగే పేరున్న నటి.ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో హీరోయిన్ గా యమ బిజీగా ఉంది.అలాంటి ప్రియాంక చోప్రా తమ హోటల్లో డిసెంబర్ 31 రాత్రి జరిగే వేడుకల్లో డ్యాన్స్ చేస్తే ఆమెకు మూడు కోట్లివ్వటానికి కూడా ముంబాయి హోటళ్ళు తయారుగా ఉంటే,ఆమె మాత్రం మీ మూడు కోట్లు నాకొద్దు,సినిమాలు నాకున్నాయి .నాకంతే చాలు.అదే పదివేలు అంటోంది.అసలు విషయమేమిటంటే ఆరోజు అందరూ బాగాతాగి ఉంటారు.ఆ గుంపులో ఎవరన్నా తన మీద దాడి చేస్తే ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు ఆటంకం కలుగుతుందన్న భావనతో ఆమె
ఆ ఫర్ ని నిరాకరించిందట