DIRECTORS

దర్శకులు కావాలనుకొనే వారికోసం

-ముందుగా మీ మీద మీ కథ మీద మీకు పూర్తి అవగాహనా నమ్మకం వుండాలి
- ఒక కథను సినిమా గా మలిచేందుకు కావలసిన క్రియేటివిటి మెలుకవలు తప్పనిసరి (ఉదాహరణకు యండమూరి వీరేంద్రనాథ్ ఆయన గొప్ప రచయిత కానీ గొప్ప దర్శకుడు కాలేక పోయాడు)
- షూటింగ్‌ మొదలు కావడానికి ముందే బౌండ్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకోవాలి.
- మధ్యమధ్య తరచుగా చూసే మార్పులు చేర్పులు చాలా డిజాస్టర్స్‌కు దారిస్తాయనే విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి.
- డైరెక్షన డిపార్ట్‌మెంట్‌లో వున్న ప్రతి ఒక్కరికీ స్క్రిప్ట్‌ మీద పూర్తి స్పష్టత వుండేలా శ్రద్ధ తీసుకోవాలి. దీనివల్ల లొకేషన్‌లో మన పని సులభమవుతుంది.
- అయితే కథ, కథనాలు బయట వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయకుండా వుండాల్సిన అవసరాన్ని డైరెక్షనన డిపార్ట్‌మెంట్‌ సభ్యులంతా గుర్తెరిగేలా చేయాలి.
- మన ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్‌ అయిన 24క్రాప్ట్స్‌కు చెందిన వారందరూ సినిమా విజయం కోసం అంకితభావంతో కృషిచేసేలా వాళ్ళను ఇన్‌స్ఫైర్‌ చేయగలగాలి. వాళ్ళందరితో వీలైనప్పుడల్లా సమావేశం అవుతూ వుండడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.
- సినిమా రూపకల్పన సందర్భంగా జరిగే మంచి, చెడు సంఘటనలు మన మనస్సుపై ప్రభావం చూపకుండా శ్రద్ధ వహించాలి. ఆ మేరకు మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. నిర్దేశిత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఓర్పుగా, నేర్పుగా అధిగమిస్తుండాలి.
- సినిమా విడుదలకు ముందు తర్వాత మన సినిమాను రకరకాల మాధ్యమాల్లో ప్రేక్షకులకు గుర్తు చేస్తూనే వుండాలి.
- టీవి, రేడియో, వెబ్‌సైట్స్‌, మొబైల్స్‌, దినపత్రికలు, వారపత్రికలు, షాపింగ్‌మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, మ్యూజిక్‌ స్టోర్స్‌, సూపర్‌మార్కెట్స్‌ వంటివి ఇందుకు సమర్థవంతంగా వినియోగించుకోవాలి.

-స్క్రిప్ట్‌ను బౌండ్‌ చేయించేనాటికి నిర్మాత,దర్శకుడి మధ్య సినిమా రూపకల్పనకు సంబంధించి ఎటువంటి విభేదాలు వుండకూడదు.
-దర్శకుడు, నిర్మాత మధ్య తలెత్తే విబేదాలు సినిమా బడ్జెట్‌పై గణనీయంగా ప్రభావం చూపుతాయి.
- ఛాయాగ్రహకుడితో కథ, కథనాలను క్షుణ్ణంగా చర్చించండి. షూటింగ్‌ ప్రారంభానికి ముందే స్టోరీ బోర్డ్‌ను సిద్ధం చేసుకోవడంతోపాటు షాట్‌ డివిజన్‌ను ప్రిపేర్‌ చేసుకోవడం పూర్తి చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో షాట్‌ డివిజన్‌ను లొకేషన్స్‌లో మార్చుకోవచ్చు. అయితే ఈ విషయమై ముందుగా హౌంవర్క్‌ చేయడం వలన దాదాపు 30శాతం శ్రమ, సమయం మనకు ఆదా అవుతాయి.
- మొదలైన దగ్గర్నుంచి ఆరు నెలల్లో సినిమా విడుదలై తీరేలా పక్కాగా ప్లాన్‌ చేసుకోవాలి. అందుకు అవసరమైన ఆర్థిక వనరులన్నీ పూర్తిగా అమరాక మాత్రమే షఉటింగ్‌ మొదలుపెట్టాలి.
- సినిమా అనే దోశను వేడివేడిగా సర్వ్‌ చేసినపుడు మాత్రమే రుచికరంగా వుంటుంది.
- ప్రీప్రొడక్షన్‌, ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్‌ అనే నాలుగు దశలూ సినిమా రూపకల్పనకు చాలా కీలకమైనవే. ప్రమోషన్‌ కోసం ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్‌లో ఇన్‌క్లూడ్‌ చేయాలి.
- ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్తవాళ్ళు రూపొందించే సినిమాలు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురారు. స్వంతంగా విడుదల చేసుకోవడానికి కూడా సిద్ధపడి మాత్రమే రంగంలోకి దిగాలి.
- ఇకపోతే విడుదలకు ముందు మీ టీమ్‌ మెంబర్స్‌కు తప్ప ఇతరులెవ్వరికీ పొరపాటున కూడా మీ సినిమాను కానీ, అవుట్‌పుట్‌ను కానీ చూపించకండి.
- థియేటర్లలో సామూహికంగా సినిమా చూసే ప్రేక్షకుల స్పందనకు ప్రివ్యూ థియేటర్‌లో ఒంటరిగా కూర్చుని సినిమాను డిసైడ్‌ చేసే పెద్ద మనుషుల లేదా మేథావుల స్పందనకు చాలా వ్యత్యాసం వుంటుంది.
- 'శివ', 'గీతాంజలి', 'మనీ' 'ఆనంద్‌' వంటి చిత్రాలు ఘన విజయాలు సాధిస్తాయనిగాని అంజి ,వీరభద్ర , ఖలేజ ,పులి లాంటి సినిమాలు ప్లాఫ్ అవుతాయని గాని ప్రివ్యూ థియేటర్లలో ఆ సినిమాను చూసిన మేథావులెవరూ అంచనా వేయలేక పోవడం గమనించవలసిన విషయం
ఔత్సాహికులకు ప్రత్యేక గమనిక :
సినిమా రూపకల్పనకు సంబంధించి మీకు పూర్తిస్థాయి అవగాహన, సరైన కార్యాచరణ లేకుండానే ఆవేశంతో రంగంలోకి దిగితే నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతారు. దర్శకులు తమ భవిష్యత్‌ (దర్శకులుగా) కోల్పోతారు. కళామతల్లి చాలా అరుదుగా మాత్రమే రెండో అవకాశాన్నిస్తుంది. తస్మాత్‌ జాగ్రత్త!!