DIRECTORS

దర్శకులు కావాలనుకొనే వారికోసం

-ముందుగా మీ మీద మీ కథ మీద మీకు పూర్తి అవగాహనా నమ్మకం వుండాలి
- ఒక కథను సినిమా గా మలిచేందుకు కావలసిన క్రియేటివిటి మెలుకవలు తప్పనిసరి (ఉదాహరణకు యండమూరి వీరేంద్రనాథ్ ఆయన గొప్ప రచయిత కానీ గొప్ప దర్శకుడు కాలేక పోయాడు)
- షూటింగ్మొదలు కావడానికి ముందే బౌండ్స్క్రిప్ట్ను సిద్ధం చేసుకోవాలి.
- మధ్యమధ్య తరచుగా చూసే మార్పులు చేర్పులు చాలా డిజాస్టర్స్కు దారిస్తాయనే విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి.
- డైరెక్షన డిపార్ట్మెంట్లో వున్న ప్రతి ఒక్కరికీ స్క్రిప్ట్మీద పూర్తి స్పష్టత వుండేలా శ్రద్ధ తీసుకోవాలి. దీనివల్ల లొకేషన్లో మన పని సులభమవుతుంది.
- అయితే కథ, కథనాలు బయట వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయకుండా వుండాల్సిన అవసరాన్ని డైరెక్షనన డిపార్ట్మెంట్సభ్యులంతా గుర్తెరిగేలా చేయాలి.
- మన ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్అయిన 24క్రాప్ట్స్కు చెందిన వారందరూ సినిమా విజయం కోసం అంకితభావంతో కృషిచేసేలా వాళ్ళను ఇన్స్ఫైర్చేయగలగాలి. వాళ్ళందరితో వీలైనప్పుడల్లా సమావేశం అవుతూ వుండడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.
- సినిమా రూపకల్పన సందర్భంగా జరిగే మంచి, చెడు సంఘటనలు మన మనస్సుపై ప్రభావం చూపకుండా శ్రద్ధ వహించాలి. మేరకు మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. నిర్దేశిత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఓర్పుగా, నేర్పుగా అధిగమిస్తుండాలి.
- సినిమా విడుదలకు ముందు తర్వాత మన సినిమాను రకరకాల మాధ్యమాల్లో ప్రేక్షకులకు గుర్తు చేస్తూనే వుండాలి.
- టీవి, రేడియో, వెబ్సైట్స్‌, మొబైల్స్‌, దినపత్రికలు, వారపత్రికలు, షాపింగ్మాల్స్‌, మల్టీప్లెక్స్లు, మ్యూజిక్స్టోర్స్‌, సూపర్మార్కెట్స్వంటివి ఇందుకు సమర్థవంతంగా వినియోగించుకోవాలి.

-స్క్రిప్ట్ను బౌండ్చేయించేనాటికి నిర్మాత,దర్శకుడి మధ్య సినిమా రూపకల్పనకు సంబంధించి ఎటువంటి విభేదాలు వుండకూడదు.
-దర్శకుడు, నిర్మాత మధ్య తలెత్తే విబేదాలు సినిమా బడ్జెట్పై గణనీయంగా ప్రభావం చూపుతాయి.
- ఛాయాగ్రహకుడితో కథ, కథనాలను క్షుణ్ణంగా చర్చించండి. షూటింగ్ప్రారంభానికి ముందే స్టోరీ బోర్డ్ను సిద్ధం చేసుకోవడంతోపాటు షాట్డివిజన్ను ప్రిపేర్చేసుకోవడం పూర్తి చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో షాట్డివిజన్ను లొకేషన్స్లో మార్చుకోవచ్చు. అయితే విషయమై ముందుగా హౌంవర్క్చేయడం వలన దాదాపు 30శాతం శ్రమ, సమయం మనకు ఆదా అవుతాయి.
- మొదలైన దగ్గర్నుంచి ఆరు నెలల్లో సినిమా విడుదలై తీరేలా పక్కాగా ప్లాన్చేసుకోవాలి. అందుకు అవసరమైన ఆర్థిక వనరులన్నీ పూర్తిగా అమరాక మాత్రమే షఉటింగ్మొదలుపెట్టాలి.
- సినిమా అనే దోశను వేడివేడిగా సర్వ్చేసినపుడు మాత్రమే రుచికరంగా వుంటుంది.
- ప్రీప్రొడక్షన్‌, ప్రొడక్షన్‌, పోస్ట్ప్రొడక్షన్‌, ప్రమోషన్అనే నాలుగు దశలూ సినిమా రూపకల్పనకు చాలా కీలకమైనవే. ప్రమోషన్కోసం ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్లో ఇన్క్లూడ్చేయాలి.
- ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్తవాళ్ళు రూపొందించే సినిమాలు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురారు. స్వంతంగా విడుదల చేసుకోవడానికి కూడా సిద్ధపడి మాత్రమే రంగంలోకి దిగాలి.
- ఇకపోతే విడుదలకు ముందు మీ టీమ్మెంబర్స్కు తప్ప ఇతరులెవ్వరికీ పొరపాటున కూడా మీ సినిమాను కానీ, అవుట్పుట్ను కానీ చూపించకండి.
- థియేటర్లలో సామూహికంగా సినిమా చూసే ప్రేక్షకుల స్పందనకు ప్రివ్యూ థియేటర్లో ఒంటరిగా కూర్చుని సినిమాను డిసైడ్చేసే పెద్ద మనుషుల లేదా మేథావుల స్పందనకు చాలా వ్యత్యాసం వుంటుంది.
- 'శివ', 'గీతాంజలి', 'మనీ' 'ఆనంద్‌' వంటి చిత్రాలు ఘన విజయాలు సాధిస్తాయనిగాని అంజి ,వీరభద్ర , ఖలేజ ,పులి లాంటి సినిమాలు ప్లాఫ్ అవుతాయని గాని ప్రివ్యూ థియేటర్లలో సినిమాను చూసిన మేథావులెవరూ అంచనా వేయలేక పోవడం గమనించవలసిన విషయం
ఔత్సాహికులకు ప్రత్యేక గమనిక :
సినిమా రూపకల్పనకు సంబంధించి మీకు పూర్తిస్థాయి అవగాహన, సరైన కార్యాచరణ లేకుండానే ఆవేశంతో రంగంలోకి దిగితే నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతారు. దర్శకులు తమ భవిష్యత్‌ (దర్శకులుగా) కోల్పోతారు. కళామతల్లి చాలా అరుదుగా మాత్రమే రెండో అవకాశాన్నిస్తుంది. తస్మాత్జాగ్రత్త!!